WG: మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవం ఘనంగా జరిగింది. 1999లో ఏర్పాటైన కళాశాల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల్లో MLA, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడారు. వ్యవసాయ రంగ ప్రగతిలో ఈ కళాశాల కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ ఆధ్వర్యంలో విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ రజతోత్సవాల్లో ఎమ్మెల్యే


