PLD: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నరసరావుపేట పట్టణంలో మాంసాహారం, మద్యం విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. మాంసం దుకాణాలు, నాన్‌వెజ్ రెస్టారెంట్లు, సంబంధిత వ్యాపార సంస్థలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ జయంతికి మాంసం, మద్యం బంద్: మున్సిపల్ కమిషనర్


