హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

RR: తుర్కయాంజల్‌ ఎంవీఎస్‌ఆర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రవీందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉండనుంది. కమ్ముగూడ, కోటగడ్డ, శాంతినగర్, వైకుంఠపురం, వినాయకనగర్, పలు కాలనీల్లో కరెంట్ సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.