E.G: రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నిత్య హారతి వేళలు మారాయి. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు సాయంత్రం 6:30 నుంచి 6:50 గంటల వరకు హారతి ఇవ్వనున్నట్లు దేవదాయ శాఖ AC విశ్వనాథరాజు బుధవారం తెలిపారు. శీతాకాలం దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి నిత్య హారతి వేళల్లో మార్పులు


