హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని సన్మానించిన కలెక్టర్

జగిత్యాల జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన రాజ్ కుమార్ ను కలెక్టర్ సత్యప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఎస్సీ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా రాజ్కుమార్ అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్త బాధ్యతల్లోనూ మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.