హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా క్రాంతి కుమార్

MDCL: మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్ నియామక పత్రం అందుకున్నారు. బుధవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తోటకూర వజ్రేష్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేస్తానని క్రాంతి కుమార్ అన్నారు.