హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట: ఖరీఫ్ (వానాకాలం) 2026-27 వరి ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్లు సుఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.