హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు మోసపోకుండా మద్దతు ధర చెల్లించాలి: కలెక్టర్

ADB: పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు మోసపోకుండా మద్దతు ధర (క్వింటాల్‌కు రూ. 8,667) అందేలా చూడాలన్నారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు, స్లాట్ గడువు వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.