BHNG: సరైన సమయానికి బస్సు రాకపోవడంతో రాజాపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు బుధవారం సాయంత్రం గాంధీ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. పుట్టగూడెం నుంచి వచ్చే తమకు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడటంతో ఆందోళన విరమించారు.
తెలంగాణ
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు


