KKD: రావికంపాడు-గొల్లప్రోలు రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని బుధవారం చేబ్రోలుకు చెందిన యువ రైతు ఓరుగంటి నాగేశ్వరరావు (34) మృతి చెందారు. కాలిఫ్లవర్ తోటకు నీరు పెట్టేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని యువ రైతు మృతి


