హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫార్మా ఉద్యోగి ఆకస్మిక మృతి!

VSP: పరవాడలో వసుధ ఫార్మాలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న కలిశెట్టి రమేశ్(36) బుధవారం విధుల్లో ఉండగా కుప్పకూలి మృతి చెందారు. విజయనగరం జిల్లా గొలగాంకు చెందిన ఆయన చినగంట్యాడలో ఉంటున్నారు. తల తిరిగి పడిపోవడంతో CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేశామని సీఐ భాస్కరరావు తెలిపారు.