కోనసీమ: రాజోలు మండలం చింతలపల్లి మెయిన్ రోడ్డుపై బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన గెడ్డం భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు ఆయనను అత్యవసర వైద్యం కోసం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు అతివేగాన్ని వీడి, ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం... ఒకరికి తీవ్ర గాయం


