హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ నిల్వ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ డ్రగ్స్‌ను భద్రంగా నిల్వ చేసేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వెనుక నిర్మిస్తున్న ఎన్‌డీపీఎస్ భవనాన్ని కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని, స్ట్రాంగ్ రూమ్, భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.