హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనుమానాస్పద మృతి పై దర్యాప్తు'

కోనసీమ: ఆలమూరు మండలం మడికి నాగులపేట మల్లవన్న తోట మార్గంలో బ్రహ్మాజీ నర్సరీ సమీపంలో బుధవారం మంగి రమేష్‌ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉండటంతో డాగ్‌ స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాలతో దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ మురళీమోహన్‌, సీఐ విద్యాసాగర్‌, ఎస్సై నరేష్‌ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై నరేష్ తెలిపారు.