హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ పి.యోగీశ్వరరావు తెలిపారు. పాతర్లపల్లి, కోటపాలెం, కొచ్చెర్ల, జీరుపాలెం, కొవ్వాడ, మరువాడ, ఎన్సీఆరపురం, తదితర గ్రామాలకు ఈ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.