మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాలకొండ బైపాస్ వద్ద అర్ధరాత్రి 12 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్‌పై వేగంగా వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్లను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5 మందికి స్వల్ప గాయాలు అయినట్టు స్థానికులు వెల్లడించారు. ఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు.
తెలంగాణ
పాలకొండ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం


