NTR: చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామంలో వీధి కుక్కల బెడద పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో కుక్కలు గుంపులుగా రహదారులపై సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నియంత్రించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోనాయపాలెంలో వీధి కుక్కల బెడద


