హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి మంత్రి సవితమ్మ పర్యటన వివరాలు

SS: పెనుకొండ మంత్రి సవితమ్మ గురువారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 7:30కి పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేస్తారు. 9:30కి పరిగిలో పెన్షన్ల పంపిణీ, బీటీ రోడ్డు పనులకు భూమిపూజ, 11కి పుట్టగూర్లపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభం, 12కి శాసనకోట–బాలిరెడ్డిపల్లి రోడ్డు పనులకు భూమిపూజ చేస్తారు.