హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 365 కిలోల గంజాయి పట్టివేత

BDK: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న మూడు వాహనాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బైక్, కారులో 109 కిలోలు, లారీలో 263.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 365.2 కిలోల గంజాయి విలువ రూ.1.82 కోట్లుగా అధికారులు తెలిపారు. మూడు వాహనాలను సీజ్ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.