హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేసీ

SS: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ నంబులపూలకుంట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, భూముల అడంగల్, మ్యుటేషన్ అప్లికేషన్లను పరిశీలించారు. భూ సమస్యల దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని ఆదేశించారు. రీ-సర్వే, పిజిఆర్‌ఎస్ వినతులపై సమీక్షించారు.