హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ: DEO

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇవాళ్టి నుంచి అక్టోబర్ 7 వరకు గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్‌ లెర్నింగ్‌పై జిల్లా స్థాయి సామర్థ్య పెంపుదల శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.