SKLM: కాశీబుగ్గ గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. టెక్కలి హుడా కాలనీకి చెందిన గొడుపు లక్ష్మి(35) భర్తకు దూరంగా విజయవాడలో ఉంటున్నారు. బుధవారం లాడ్జిలో గది తీసుకున్నారు. మధ్యాహ్నం ఫోన్‌కు స్పందన లేకపోవడంతో సిబ్బంది తలుపు తీసి చూడగా విగతజీవిగా కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి


