హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ'

VSP: ఈనెల 25న రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఎల్ఎన్-4 హ్యాండ్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్, రైలు ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.