హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల వివక్షకు తావు ఇవ్వొద్దు: తహశీల్దార్

గద్వాల: గ్రామాల్లో కుల వివక్షకు అవకాశం ఇవ్వొద్దని అయిజ తహశీల్దార్ జ్యోతి పేర్కొన్నారు. మండలంలోని ఉత్తనూర్‌లో బుధవారం పౌరహక్కుల దినం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో అందరూ సమానమని కులాల ప్రాతిపదికన ఎవరినీ విభజించవద్దని సూచించారు. కుల వివక్ష చూపే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.