నారాయణపేట: జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 కబడ్డీ విభాగం పోటీల్లో మరికల్ మండల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి అందుకున్నారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు సమన్వయంతో, పట్టుదలతో ఆడి విజయం సాధించారని పీఈటీలు తెలిపారు. ఈ విజయం మండలానికి గర్వకారణమన్నారు. అనంతరం విజేత విద్యార్థులను పలువురు అభినందించారు.
తెలంగాణ
జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మరికల్ విద్యార్థుల సత్తా


