హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పెద్దపల్లిలో మెగా జాబ్ మేళా

PDPL: పెద్దపల్లి టాస్క్ రీజియన్ కేంద్రంలో జిల్లా ఉపాధి శాఖ, టాస్క్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, ఫార్మసీ వరకు అర్హత, ఆసక్తిగల నిరుద్యోగులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.