హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

KNR: హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.