హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ ముఖ్య అర్చకుడిగా గణేష్

SRCL: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న గోపన్నగారి గణేశ్‌కు ముఖ్య అర్చకుడిగా పదోన్నతి లభించింది. ఈ మేరకు దేవస్థానం ఈవో ఎల్‌. రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.డీఈవో ప్రతాప నవీన్‌కుమార్‌, వేద పండితులు, ప్రధాన అర్చకులు,ఆలయ ఉద్యోగులు గణేశ్‌ను అభినందించారు. స్వామివారి సేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.