KDP: మైదుకూరు పట్టణంలోని మార్కెట్ కూడలి సమీపంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని మృతదేహం లభ్యం


