WGL: నగరంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో ఆర్వోబీ వంతెన దిగువన మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువల్లోని మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో రహదారి మొత్తం నీటిమయంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డుపైకి చేరిన మురుగునీరు.. వాహనదారుల అవస్థలు


