హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవుని కడపలో తాగునీటి కష్టాలు

KDP: దేవుని కడపలో తాగునీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. గతంలోనూ దుర్వాసనతో కూడిన నీరు సరఫరా అయ్యిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గుర్తించిన YCP 12వ డివిజన్ ఇన్‌చార్జి నాగమణి ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేశారు.