హైదరాబాద్: 28°C
వార్తలు

ధీరేంద్ర శాస్త్రి క్షమాపణలు చెప్పాలి: ఇమామ్

ఓ మతంపై భగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను పంజాబ్ షాహీ ఇమామ్ మొహమ్మద్ ఖండించారు. తమ మత మనోభావాలను ఆయన అగౌరవపరిచారని ఆరోపించారు. వెంటనే ఆధ్యాత్మిక గురువు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.