హైదరాబాద్: 28°C
వార్తలు

మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు

కర్ణాటకలోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌కు భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీకి చెందిన కోకర్ హైడ్రోట్రీటర్ యూనిట్‌లో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు రిఫైనరీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకుంది. 
ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.