NLR: చేజర్ల మండలంలోని వావిలేరు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ పద్మ విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ... పౌష్టికాహారం వలన కలిగే ఉపయోగాలను స్థానికులకు వివరించారు. గర్భవతులు, బాలింతలు ప్రతిరోజు ఆకుకూరలు, తాజా పండ్లు, గుడ్లు తినాలని సూచించారు. వీలైనంతవరకు ఇంటి భోజనాన్ని తినాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చేజర్లలో పౌష్టికాహారంపై అవగాహన


