కాకినాడ జిల్లా పోలీస్ యూనిట్‌లో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన సామర్లకోట ఎస్సై ఎ. గరగారావు, ట్రాఫిక్-2 హెడ్ కానిస్టేబుల్ వి. శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఘనంగా సత్కరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘన సత్కారం


