హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

GNTR: బుర్రిపాలెంలో అక్టోబర్‌ 4న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. గృహ నిర్మాణాలకు సీఎం, కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనుండగా బుధవారం ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభకు సుమారు 5 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, రహదారి మరమ్మతు పనులను పకడ్బందీగా చేపడుతున్నారు.