హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.2.63 కోట్ల రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

E.G: సీతానగరం మండలం మిర్తిపాడు–బుచ్చెంపేటలో బొబ్బిల్లంక నుంచి బుచ్చెంపేట వరకు రూ. 2.63 కోట్లతో నిర్మించనున్న నూతన బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యత పాటించి, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు.