ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ 150 వసంతాల వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒంగోలు స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఘనమైన చరిత్ర ఉన్న ఒంగోలును ఆధునిక మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలతో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలును మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి


