హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రోమాడియోలోన్‌ పై అవగాహన కార్యక్రమం

కృష్ణా: ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎలుకల సమగ్ర యాజమాన్యం, బ్రోమాడియోలోన్ ఎర వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా. సుధారాణి మాట్లాడుతూ.. పంట పొలాల్లో ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాంత్రిక పద్ధతులు మరియు శాస్త్రవేత్తల సాంకేతిక సూచనలను పాటించాలని రైతులకు వివరించారు.