హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనికి వెళ్లి గుండెపోటుతో వ్యక్తి మృతి..!

KDP: బ్రహ్మంగారిమఠం మండలం గుండాపురం గ్రామానికి చెందిన కల్లూరి రాజగోపాల్‌ (45) కూలి పనుల కోసం వింజమూరుకు వెళ్లి గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అప్పుల ఒత్తిడితో మానసిక ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. కూలి పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందారు. రాజగోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.