హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోడ్రైవర్‌పై బ్లేడుతో దాడి

ATP: వ్యక్తిగత కక్షలతో ఆటోడ్రైవర్ పై మరో ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన రాయదుర్గం పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఊడేగోళం గ్రామానికి చెందిన ముద్దానప్ప తన విధుల్లో వెళుతుండగా మరో ఆటోడ్రైవర్ హుస్సేన్ బ్లేడుతో దాడి చేయడంతో అతడి చెవికి గాయాలయ్యాయి. గమనించిన బంధువులు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.