KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం ఉదయం కోతుల గుంపు హల్‌చల్ చేసింది. దాదాపు అరగంట పాటు ఇళ్ల వద్దే ఉండటంతో స్థానికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. కోతులను తరిమేందుకు ఇళ్లపై నుంచి నీళ్లు పోసినా అవి కదల్లేదు. చివరకు కొందరు టపాసులు కాల్చడంతో కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
తెలంగాణ
టీచర్స్ కాలనీలో కోతుల గుంపు హల్‌చల్


