హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌లో ప్రస్తుత నీటి నిల్వ

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1,080.50 అడుగులు, నీటి నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 1,157 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,157 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలీసాగర్, సరస్వతి, లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 41.928 టీఎంసీల నీరు వచ్చి, 11.626 టీఎంసీలు విడుదలైనట్లు తెలిపారు.