MDK: మెదక్ మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ భారత్ ఫంక్షన్ హాల్‌లో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన 9 మంది నిరుపేద, అర్హత కలిగిన మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు.
తెలంగాణ
మిల్లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ


