ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్టీ అభ్యర్థులకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత భోజన వసతితో కూడిన 60 రోజుల ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుందని ప్రాజెక్ట్ అధికారి బుధవారం తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 100 మందిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు అక్టోబర్ 5వ తేదీ ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'


