NLG: చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగల్ మండలం పొనుగోడుకు చెందిన బండమీది శ్రీను మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీను తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా కల్వర్టు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


