కరీంనగర్: శంకరపట్నం మండలం జాతీయ రహదారి-563పై కేశవపట్నం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ చిక్కుకుని ఓ లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ స్పాట్ డెడ్!


