హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

JGL: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వెళ్లకుండా వెల్గటూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బహిరంగ సభకు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు.