హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుద్ధ వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NRML: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ పరిధిలోని సుద్ధ వాగులో సుమారు 40-45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతుడు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా వివరాలు తెలిసిన వారు నర్సాపూర్ ఎస్‌హెచ్‌ఓను 8712659518 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.