హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానంతో దాడి.. వ్యక్తి మృతి

MDK: వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్‌లో రాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ప్రవీణ్ సెల్‌ఫోన్ చోరీ చేశాడనే అనుమానంతో రామానుజంపై ప్రవీణ్ కుటుంబసభ్యులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో రామానుజం అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.